: 'మాసాయిపేట' దుర్ఘటనలో గాయపడి పుట్టినరోజు జరుపుకున్న దర్శన్

మాసాయిపేట దుర్ఘటనలో గాయపడిన మృత్యుంజయుడు దర్శన్ గౌడ్ స్పృహలోకి వచ్చాడు. నేడు దర్శన్ గౌడ్ పుట్టిన రోజు కావడానికి తోడు స్పృహలోకి రావడంతో బాలుడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దీంతో దర్శన్ తో కేక్ కట్ చేయించారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. అందులో ప్రమాదంలో గాయపడిన 20 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వారిలో ఐదుగురు విద్యార్థులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని అన్నారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పసివాళ్లను రక్షించేందుకు 40 మంది వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారని బులెటిన్ లో వివరించారు. 2,3 రోజుల్లో కొందరిని డిశ్చార్జ్ చేస్తామని వారు వెల్లడించారు.

More Telugu News