: దేవుని కడప శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న పురంధేశ్వరి

కడప జిల్లా రాజంపేట ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ప్రచారంలో భాగంగా కడపలోని పెద్ద దర్గాలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు నుంచి దేవుని కడప శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆ దేవుడిని వేడుకొన్నానని ఆమె చెప్పారు. దేవుని కడపలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెళ్లి చేసుకున్న వధూవరులను పురందేశ్వరి ఆశీర్వదించారు. ఆమెతో పాటు పలువురు బీజేపీ, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Telugu News