: గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ!
కాంగ్రెస్ కురువృద్ధుడు నారాయణ దత్ తివారీ గృహనిర్బంధంలో ఉన్నారని అతని అలనాటి ప్రేయసి, కాంగ్రెస్ నేత ఉజ్వల శర్మ, ఆమె కుమారుడు రోహిత్ శేఖర్ ఆరోపించారు. 88 ఏళ్ల తివారీని కలిసేందుకు వారు వెళ్లగా, అధికారులు వారిని ఆపేశారు. దాంతో వారు ఇనుప గేటు బద్దలు గొట్టి మరీ అనుచరులతో సహా లోపలికి వెళ్లారు. లక్నో ప్రజలకు ఈ వివాదం పెద్ద వినోదంగా మారింది.
సుప్రీం కోర్టు తీర్పు రోహిత్ శేఖర్ ను ఎన్డీ తివారి కుమారుడిగా నిర్థారించిన తరువాత 20 రోజుల పాటు తన తండ్రి తివారీని కలిసేందుకు ప్రయత్నించారు. అతనిని కలవనీయకపోవడంతో 'తివారీ అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకు సహాయం అవసరం. కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఒక కుట్ర. ఆయనని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా ఉంది' అని 70 ఏళ్ల ఉజ్వల వాదించారు.
'నాకు తివారీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. ఆయన జీవన సంధ్యాకాలంలో కాసింత సేవచేసుకునే అవకాశం కల్పించండి' అని ఉజ్వల కోరుతున్నారు. అయినప్పటికీ ఇంట్లోకి ఆమెను అనుమతించకపోవడంతో వారు గేటు బద్దలు కొట్టి ప్రవేశించారు. దీనిపై తివారి భద్రతా సిబ్బంది మాట్లాడుతూ, తివారీ ఆదేశాల మేరకే తాము ఆమెను నిరోధించామని చెప్పారు.