: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ ఈ ఫలితాలను హైదరాబాదులో విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 65.57 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఎప్పటిలాగే ఫలితాల ఉత్తీర్ణతలో బాలికలే పైచేయిగా నిలిచారని చెప్పారు. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 69.52 శాతం నమోదవగా, బాలుర ఉత్తీర్ణత శాతం 61.87గా నమోదైందని తెలిపారు. ఇక వొకేషనల్ లో 60.70 శాతం ఉత్తీర్ణత నమోదవగా... గతేడాదితో పోలిస్తే 0.21 శాతం ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగిందని వివరించారు. పునర్ మూల్యాంకనం, పునర్ గణనకు ఈ నెల 9 చివరి తేదీగా నిర్ణయించారు.