: జమ్మూలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

జమ్మూ అంటే కురుస్తున్న మంచు, చల్లటి వాతావరణం ఇవే గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు జమ్మూలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న జమ్మూలో ఏకంగా 40.3, ఈరోజు 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. చల్లటి వాతావరణానికి అలవాటుపడ్డ జమ్మూ ప్రజలకు ఈ వేడిమి భరించలేనిదిగా తయారయింది. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రాలేదు. రోడ్లు, వాణిజ్య కూడళ్లు జనంలేక వెలవెలబోయాయి.

More Telugu News