: సువార్త సభల్లో బ్రదర్ అనిల్ ఎన్నికల ప్రచారం

వైఎస్సార్సీపీ అధినేత జగన్ బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం అద్దాడలో సువార్త సభలను నిర్వహించారు. ఈ సభకు బ్రదర్ అనిల్ తో పాటు పామర్రు వైకాపా అభ్యర్థి కల్పన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. దీనికి పోలీసులు అడ్డు చెప్పడంతో సభ నుంచి కల్పన వెళ్లిపోయారు. మరో విషయం ఏమిటంటే, సువార్త సభలకు రావడానికి బ్రదల్ అనిల్ ఉపయోగించిన వాహనంపై వైకాపా జెండాలున్నాయి.

More Telugu News