: అభిమానులు, కార్యకర్తలను నిరాశ పరిచిన చిరంజీవి

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక ఆకర్షణాస్త్రం కేంద్ర మంత్రి చిరంజీవి. సినిమాలకు విరామమిచ్చి పూర్తి స్థాయి రాజకీయవేత్తగా స్థిరపడిన చిరంజీవికి అభిమానుల ఆదరణ తగ్గలేదు. రాష్ట్ర విభజనతో నూకలు చెల్లిన కాంగ్రెస్ పార్టీ సభలకు జనాలు వస్తున్నారంటే దానికి కారణం చిరంజీవేనని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తారు. ఓటు సంగతి అలా ఉంచితే తమ అభిమాన నటుడ్ని చూసేందుకు జనాలు వస్తున్నారన్నది వాస్తవం.

అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర మంత్రి చిరంజీవి అక్కడ ప్రసంగం చేయలేదు. అంతే కాకుండా అభిమానులు, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు. కాసేపు వాహనం పైకెక్కి ప్రజలకు అభివాదం మాత్రం చేశారు. మిగిలిన సమయమంతా బస్సుకే పరిమితమయ్యారు. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి.

More Telugu News