: ఉగ్రదాడుల నియంత్రణకు అమెరికా తరహా ఏకీకృత నిఘా వ్యవస్థ రావాలి: జేపీ

దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడులపై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జేపీ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. మన దేశంలో ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే... అమెరికా తరహా ఏకీకృత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది రావాలంటే, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ 3వ లిస్టును సవరించాల్సి ఉంటుందని చెప్పారు. ఐదేళ్లుగా ప్రజల కోసం చాలా చేశామని... రానున్న ఎన్నికల్లో లోక్ సత్తా అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఓటర్లదేనని తెలిపారు.

More Telugu News