: బ్రూనైలో ఇక కఠిన దండనలు
సుల్తానేట్ ఆఫ్ బ్రూనై ఇస్లామిక్ క్రిమినల్ లాను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసిన తొలి తూర్పు ఆసియా దేశంగా బ్రూనై చరిత్రలో నిలిచిపోనుంది. తొలి దశలో వివాహేతర సంబంధాలు కలిగివుండడం, శుక్రవారం ప్రార్థనలు చేయకపోవడం వంటి నేరాలకు జరిమానా లేక జైలు శిక్షలు అమల్లోకి వస్తాయి. 12 నెలల తర్వాత దొంగతనాలు, మద్యపాన సేవనం నేరాలకు శిక్షల అమలు మొదలవుతుంది. చివరి దశలో స్వలింగ సంపర్కరం, మహహ్మద్ ప్రవక్తను కించపరచడం వంటి నేరాలకు మరణశిక్ష, కొట్టిచంపడం వంటి కఠిన దండనలు అమల్లోకి వస్తాయి. ఇవన్నీ ముస్లింలకు తప్పనిసరిగా వర్తిస్తాయి. వీటిలో అధికశాతం ముస్లిమేతరులకు కూడా అమలవుతాయి.