: చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ అంటే ద్వేషం: పవన్ కల్యాణ్

నెల్లూరులో ఎన్డీయే ఆధ్వర్యంలో బహిరంగసభ జరుగుతోంది. ఈ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.

నెల్లూరులో తాను చదువుకున్న రోజులను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నెల్లూరుతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ... సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూలు తనకింకా గుర్తున్నదని చెప్పారు. వీఆర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నానని, అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అసహ్యమని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ నేతలు కొనసాగించిన దోపిడేనే కారణమన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో దోచుకున్న విధానమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయేందుకు కారణమైందని ఆయన చెప్పారు. తెలంగాణ పోరాటం గురించి తాను నెల్లూరులో ఉన్నప్పుడే తెలుసుకున్నానని పవన్ అన్నారు.

More Telugu News