: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడి దౌర్జన్యం... కేసు నమోదు
టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై పోలీసు కేసు నమోదు అయింది. ఈ రోజు పోలింగ్ నేపథ్యంలో విక్రమ్ గౌడ్ గౌలిగూడకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై ఆయన దౌర్జన్యానికి దిగారు. ఈ వ్యవహారంపై టీడీపీ కార్యకర్తలు అఫ్జల్ గంజ్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో విక్రమ్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.