: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధుకు కాంస్యం
దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఉమెన్ సింగిల్స్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధు ఓటమి పాలైంది. చైనా టాప్ సీడ్ క్రీడాకారిణి అయిన షిజియాన్ వాంగ్ చేతిలో 21-15, 20-22, 12-21 తేడాతో వెనుదిరిగింది. దాదాపు గంట పద్దెనిమిది నిమిషాల పాటు జరిగిన గేమ్ లో రెండు సార్లు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ అయిన వాంగ్ సింధును మట్టికరిపించడంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.