: ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి అంతిమ యాత్ర
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి అంతిమ యాత్ర ఆళ్లగడ్డలోని ఆమె నివాసం నుంచి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్, విజయమ్మ, షర్మిల ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆమె అంతియ యాత్రలో అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శోభానాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డ శోకసంద్రమైంది.