: పాల్వాయి, రాజేశ్వరరావులకు పీసీసీ షోకాజ్ నోటీసులు
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారిద్దరికీ పీసీసీ తరపున క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీకి నష్టం కలిగించేలా వారి చర్యలు ఉన్నాయని ఈ రోజు హైదరాబాదులో భేటీ అయిన సంఘం పేర్కొంది. వెంటనే క్షమాపణ చెబుతూ లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.