: సినిమాలు చేస్తా... రాజకీయాల్లోనూ ఉంటా: పవన్ కల్యాణ్
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ప్రజల తరపున రాజకీయ నేతలను ప్రశ్నించేందుకు జనసేన పార్టీని స్థాపించానని అన్నారు. అలాగే, "ఇక ముందు కూడా సినిమాలు చేస్తా, రాజకీయాల్లో కూడా ఉంటా" అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చింది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలే అయినా, తెలంగాణ వచ్చింది మాత్రం ఇక్కడి యువకుల బలిదానాల వల్లేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాని, కేసీఆర్ చెప్పినట్టు టీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ అంటే తనకు ఇష్టం, గౌరవం అని ఆయన చెప్పారు.