: మమ్మల్ని ఆదేశించే అధికారం సీబీఐ కోర్టుకు లేదు: సీబీఐ వర్గాలు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు, విజయశాంతి ఆస్తులపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించడాన్ని సీబీఐ వర్గాలు తిరస్కరిస్తున్నాయి. తమను ఆదేశించే అధికారం సీబీఐ కోర్టుకు లేదంటున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుకు మాత్రమే ఆదేశించే అధికారం ఉందని అంటున్నాయి. ప్రస్తుతం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదని చెప్పాయి. అయితే, సీబీఐ కోర్టు ఆదేశాలను కేంద్ర కార్యాలయానికి పంపామని, వారి ఆదేశాలు వచ్చాక విచారణ చేయాలా? లేదా? అనేది నిర్ణయం తీసుకుంటామని సీబీఐ వర్గాలు తెలిపాయి.