: రేపు హిందూపురంలో లోకేష్ ఎన్నికల ప్రచారం

టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో అంతగా అనుభవం లేకపోయినా తన ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు హిందూపురంలో బరిలోకి దిగిన మామ, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కోసం లోకేష్ ప్రచారం చేయనున్నారు. రేపు (శనివారం) హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు, హిందూపురంలో లోకేష్ రోడ్ షో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.

More Telugu News