: జేసీ సోదరుల కుమారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల తనయులు జేసీ పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు తాడిపత్రి మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 2009 ఏప్రిల్ 24న టీడీపీకి చెందిన కందిగోపుల మురళి ఇంటిపై దాడిచేసి వస్తువుల్ని దహనం చేశారనే కేసులో న్యాయస్థానం వారిద్దరినీ నిందితులుగా భావించింది. దీనిపై సమగ్ర విచారణ అనంతరం పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. దీంతో వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.