: ఎలక్షన్ డ్యూటీ చేస్తూ ఆ అధికారి ప్రాణాలు విడిచింది!

సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు విధులు నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కొప్పాట్ పోలింగ్ కేంద్రంలో వైశాలి భావే (35) రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తూ... మధ్యాహ్నం గుండెనొప్పి వస్తోందని తనతో పాటు పనిచేసే అధికారులకు చెప్పింది. దీంతో వారు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆమెను థానే ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

More Telugu News