: ఎన్నికల తేదీల్లో షూటింగులు, థియేటర్లు బంద్: ఏపీ ఫిల్మ్ ఛాంబర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణలో, మే 7న సీమాంధ్రలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లో సినిమా షూటింగ్ లు ఉండవని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రకటన జారీ చేసింది. అంతేగాక థియేటర్లు కూడా మూసివేస్తారని తెలిపింది. ఈ మేరకు ఛాంబర్ నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగులో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ప్రకటించింది.

More Telugu News