: టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం షురూ?
టీడీపీ తరపున ఈసారి ఎన్నికల్లో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం లేనట్లేనని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రచారానికి సిద్ధమైనట్లు సమాచారం. దానికి సంబంధించి రేపు (గురువారం) మీడియాకు అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు ప్రచారం కోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారని వినికిడి. ఓ వైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు స్టార్ క్యాంపైనర్లుగా మారి టీడీపీికి తమదైన ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు తాను కూడా వెళ్ళడమే ఉత్తమమని భావించిన జూనియర్ ఇక ప్రచారాన్ని షురూ చేస్తున్నాడట.