: మార్కెట్లోకి వచ్చిన సరికొత్త సోలార్ లాంతరు
కిరోసిన్ లాంతరుతో పోలిస్తే... చవకైన సోలార్ ల్యాంప్ (లాంతరు)ను స్విట్జర్లాండ్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని తయారీ చాలా సులభమని, సెల్ ఫోన్ బ్యాటరీ, వైరు, ఖాళీ సీసాలతో దీనిని తయారుచేసుకోవచ్చని తెలిపింది. కిరోసిన్ లాంతరులతో కలిగే ఇబ్బందులను తొలగించడానికి దీనికి రూపకల్పన చేశామని కంపెనీ చెప్పింది. వ్యాపార ప్రయోజనాల గురించి కాక ప్రజలకు ప్రయోజనం కలిగేందుకే దీన్ని తయారుచేశామని వెల్లడించింది. భారత్, కెన్యా, టాంజానియా తదితర దేశాలకు చెందిన సుమారు 200 మందికి దీని తయారీ విధానంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.