: చంద్రబాబును ఇంటికి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఇంటికి ఆహ్వానించారు. దీంతో, మరికాసేపట్లో పవన్ ఇంటికి బాబు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై వీరిరువురూ చర్చించనున్నారు. దీనికి తోడు, నిన్న మోడీ సభలో వీరిద్దరూ అంటీముట్టనట్టు ఉన్నారన్న వార్తలకు ఈ భేటీతో ముగింపు పలకనున్నారు. నిన్న జరిగిన మోడీ, చంద్రబాబు, పవన్ ల సభ సక్సెస్ కావడంతో... వీరు మరింత ఉత్సాహంగా ఉన్నారు.