: చీటింగ్ కేసులో ఇరుక్కున్న టీడీపీ అభ్యర్థి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న జయనాగేశ్వర్ రెడ్డి చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఒకరి వద్ద నుంచి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకుని చెల్లని చెక్కులు ఇచ్చినందుకు ఆయనపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమకందిన ఫిర్యాదు మేరకు పోలీసులు జయనాగేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.