: కేసీఆర్... పిచ్చివాగుడు ఆపేయ్!: పవన్ కల్యాణ్
తెలంగాణలో సీమాంధ్రులు ఉండొచ్చు కాని, ఇక్కడ పోటీ చేసే హక్కు మాత్రం సీమాంధ్రులకు లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. పీవీని ప్రధాని చేసింది సీమాంధ్రులేనని... దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని వపన్ సూచించారు. ఇలాంటి పిచ్చి వాగుడు కేసీఆర్ ఆపాలని హెచ్చరించారు. తెలుగుజాతి మధ్య విద్వేషం తలెత్తితే... అది దేశ సమైక్యతకే భంగం కలిగిస్తుందని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలను కేసీఆర్ కట్టిపెట్టాలని హితవు పలికారు. పిచ్చిపిచ్చిగా వాగితే ఊరుకోమని హెచ్చరించారు. హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ సభలో పవన్ ప్రసంగించారు.
రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారని... ఏమీ తెలియని రాహుల్ ప్రధాని కావాలని ఎలా అనుకుంటున్నారని అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ ఎక్కడ... ఏమాత్రం అనుభవం లేని రాహుల్ ఎక్కడని ప్రశ్నించారు. దేశం మొత్తం మోడీని కోరుకుంటోందని... మోడీ ప్రధాని అవుతారని చెప్పారు. ప్రధాని కావాలంటే గాంధీ కుటుంబంలో పుడితే సరిపోదని... గొప్ప నాయకత్వ లక్షణాలు ఉండాలని సూచించారు. దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.