: ఏపీ కొత్త రాజధానికి సలహాలు, సూచనలకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం సలహాలు, సూచనలు పంపాలంటూ కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఆహ్వానించింది. రాజధానికి అనువైన స్థలంపై ప్రజలు వారి సలహాలను ఇవ్వాలని కోరింది. ఈ మేరకు అభిప్రాయాలను [email protected] ఈ మెయిల్ కు పంపాలని తెలిపింది. ఈ నెల 30లోగా ప్రజలు తమ అభిప్రాయాలను పంపించాలని వెల్లడించింది. అటు రాజధానిపై ప్రభుత్వ సలహాలను కూడా కమిటీ తీసుకోనుంది. రెండు రాష్ట్రాల్లోని నిపుణుల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు, ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని కూడా విశ్లేషించనుంది. కొత్త రాజధాని ఎంపిక కోసం వివిధ వర్గాలను కూడా కమిటీ సంప్రదించనుంది. అనంతరం ఆగస్టు 31లోగా రాజధానిపై ఓ నివేదికను కేంద్ర హోంశాఖకు కమిటీ పంపిస్తుంది.

More Telugu News