: తెలంగాణ ప్రజలను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటు: నరేంద్ర మోడీ

నిజామాబాద్ లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో నరేంద్రమోడీ తన ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారు. పూర్తిగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకున్న మోడీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరును ఓటర్ల కళ్లకు కట్టినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటన్నారు. గతంలో సోనియా కుటుంబం తెలంగాణ బిడ్డ పీవీని అవమానించిందన్నారు. ఎవరి సంస్కరణల వల్ల దేశం నిలబడిందో ఆయనను గౌరవించాలన్న సంస్కారం కాంగ్రెస్ కు లేదన్నారు. ఇక తెలంగాణకు చెందిన నాటి ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించింది రాహుల్ తండ్రి రాజీవ్ కాదా? అని అడిగారు.

కాంగ్రెస్ చరిత్రను చూస్తే ఆ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా? అన్నారు. తెలంగాణ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే ఇక్కడ అడుగుపెట్టానని, వందల మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ కు మళ్లీ ఓటేద్దామా? అలాంటి పాపాత్ములున్న పార్టీకి ఓటేసి గెలిపిద్దామా? అని ప్రజలను ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు.

More Telugu News