: హేమమాలినికి వ్యతిరేకంగా మధురలో కరపత్రాలు
ఉత్తరప్రదేశ్ లోని మధురలో సినీనటి, బీజేపీ తరపున లోక్ సభకు పోటీ చేస్తున్న హేమమాలినికి వ్యతిరేకంగా కొందరు కరపత్రాలను పంపిణీ చేశారు. హేమమాలినికి ఉన్న విద్యార్హతలు ఏంటి? అంటూ అందులో ప్రశ్నించారు. ఈ ఉదయం వార్తాపత్రికలతో పాటు వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే, వాటిపై ఎవరి పేరూ లేదు. దీనిపై ఎన్నికల నిబంధనావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ధీరేంద్ర సింగ్ వెల్లడించారు.