: టీఆర్ఎస్ ఓ చిల్లరకొట్టు పార్టీ: జైపాల్ రెడ్డి
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనని, ఈ విషయాన్ని కాంగ్రెస్ లో లేని వారు కూడా ఒప్పుకుంటున్నారని అన్నారు. అద్వానీ, మోడీ తెలంగాణ వ్యతిరేకులని ఆయన అన్నారు. వారి శక్తి పెరిగితే తెలంగాణకు నష్టం తప్పదన్నారు. ఇక, టీఆర్ఎస్ ఒక చిల్లర కొట్టు పార్టీ అని, దానిని ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి అని జైపాల్ రెడ్డి చెప్పారు.