: మోడీని పాతిపెడతాం: జేడీయూ నేత నోటి దురుసు
సార్వత్రిక ఎన్నికల ఘట్టం సగం పూర్తయిపోగా, నేతల నోటి దురుసు మాత్రం విపరీత స్థాయికి చేరుతోంది. జేడీయూ నేత శకునిచౌదరి బీహార్ లోని భాగల్పూర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మేము నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులతో చేయి కలిపితే.. మోడీని భాగల్పూర్ మట్టిలో పాతి పెడతాం' అని అన్నారు. ఆ సమయంలో మోడీ బద్ధ వ్యతిరేకి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ అదే వేదికపై ఉన్నారు. అయినా, ఆయన శకుని చౌదరి వ్యాఖ్యలను ఖండించలేదు.