: ఏడున్నరేళ్లుగా కూతురిపై అత్యాచారం... నిందితుడి అరెస్ట్

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్న నీచుడిని ఉత్తరప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. బారాబంకిలోని రామ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల తన పెద్ద కూతురిపై ఏడున్నరేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. అయితే, తాజాగా చిన్న కూతురిపై కూడా అత్యాచారం చేయబోగా, వారు ఇంటి నుంచి పారిపోయారు. బంధువు సాయంతో పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘోరాన్ని వెల్లడించారు. తన తండ్రి ఏడున్నరేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని, అమ్మ ముందే అత్యాచారం చేసేవాడని బాధితురాలు తెలియజేసింది. తన తల్లి అడ్డుకోబోతే తీవ్రంగా కొట్టి బెదిరించేవాడని బాధను చెప్పుకుంది. ఆమె కన్న తల్లి రెండేళ్ల క్రితం మరణించింది. కాగా, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా, అతడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.

More Telugu News