: ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రోహిణి ప్రమాణం
తెలుగు వ్యక్తి, మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రోహిణిని పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్ట్రపతి నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు జస్టిస్ రోహిణితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు. విశాఖలో 1955 ఏప్రిల్ 14న జన్మించిన ఆమె, 1976లో ఓయూ నుంచి డిగ్రీ, తర్వాత ఆంధ్రా వర్సిటీ నుంచి లా చదివారు.