: నేడు శ్రీకాకుళం జిల్లాలో బాలకృష్ణ పర్యటన

తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నరసన్నపేట నియోజకవర్గం సారవకోట చేరుకుంటారు. 11.30 గంటలకు రోడ్ షోలో పాల్గొని అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పోలాకిలో జరిగే రోడ్ షో, బహిరంగసభలో పాల్గొంటారు. 2గంటలకు ఉర్లాంలో, 3 గంటలకు ఆముదాలవలస నియోజకవర్గంలోని భృజకొల్లివలస జంక్షన్ లో జరిగే రోడ్ షోలో పాల్గొని అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఇక సింగుపురంలో 6 గంటలకు, శ్రీకూర్మంలో 7.30 గంటలకు, శ్రీకాకుళం పట్టణంలో 8.30 గంటలకు జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు.

More Telugu News