: కేసీఆర్ క్షమాపణలు చెప్పు... సెటిలర్లు మా వైపే!: పొన్నాల
తెలంగాణలో నివసిస్తున్న ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొట్టి, వారిలో అభద్రతా భావం పెంచింది కేసీఆర్ అని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ సెటిలర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తామెన్నడూ సెటిలర్ల ఓట్ల కోసం వెంపర్లాడలేదని, సెటిలర్లు తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో సెటిలర్ల ఓట్లు పడవని కేసీఆర్ కు అర్థమైందని, ఆ దుగ్ధతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగుతున్నాడని పొన్నాల విమర్శించారు.