: అనారోగ్యంతో తల్లి ఏనుగు మృతి... తల్లిని వీడని పిల్ల

సృష్టిలో తల్లీ, బిడ్డల మధ్య బంధాన్ని మించినది లేదు. అది జంతువైనా, మనిషైనా సరే. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో అంతియూర్ రక్షిత అభయారణ్యంలో ఈ రోజు ఒక ఏనుగు మరణించింది. నీళ్లు తాగేందుకు పిల్లతో కలసి వెళ్లిన అది ఒక్కసారిగా నేలపై తూలిపడి ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్యం కారణంగా అది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రాణాలు కోల్పోయిన తల్లిని విడిచి పెట్టేందుకు పిల్ల ఏనుగు ససేమిరా అంటోంది. అధికారులు ఎంత ప్రయత్నించినా అంగుళం కూడా కదలకుండా, తల్లికోసం విలపిస్తోంది.

More Telugu News