: కేజ్రీవాల్ కు వారణాసిలో అడుగడుగునా కష్టాలే

ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వారణాసిలో కష్టాలు ఎదుర్కొంటున్నారు. తొలుత ఇంక్ తో నిరసన ఎదుర్కొన్నారు. తర్వాత రాళ్ల దాడి, ఇప్పుడు ఆయన ఉంటున్న స్థలంపై వివాదం నెలకొంది. వారణాసిలో ప్రసిద్ధి చెందిన సంకట్ మోచన్ ఆలయం కాంప్లెక్స్ లో కేజ్రీవాల్ బస చేస్తున్నారు. తల్లిదండ్రులు గీతాదేవి, గోవింద్ కేజ్రీవాల్ తో కలసి ఉంటున్నారు. అయితే ఆధ్యాత్మిక క్షేత్రం వద్ద రాజకీయ కార్యకలాపాలు నడపడంపై భక్తులు అభ్యంతరాలు లేవదీశారు. దీంతో సమస్య పెద్దది కాకముందే కేజ్రీవాల్ తన లగేజీ సర్దుకుని దుర్గాకుండ్ ప్రాంతానికి మారిపోయారు. సంకట్ మోచన్ ఆలయ పూజారి కేజ్రీవాల్ కుటుంబానికి తెలిసినవారు.

More Telugu News