: రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ

హైదరాబాదులోని జూబ్లీహాలులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని అరికట్టాలని పార్టీల నేతలు ఈసీని కోరారు. అంతేకాకుండా, కుల ప్రాతిపదికపై ఓటర్లను ప్రలోభపెట్టే పార్టీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది.

More Telugu News