: నేడు చంద్రబాబు త్రీడీ ప్రచారానికి శ్రీకారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు త్రీడీ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎన్ఆర్కే ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. త్రీడీ టెక్నాలజీ సాయంతో చేయనున్న ఈ ప్రచారానికి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, మెదక్ జిల్లా పటాన్ చెరు, నల్గొండ జిల్లా భువనగిరి, కర్నూలు జిల్లా బనగానపల్లి, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.