: ఊపిరాడక ప్రాణాలు పోయాయనుకున్నా: మమతా

ఊపిరాడక ప్రాణాలు పోయాయనుకున్నానని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తను బస చేసిన హోటల్ గదిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఘటన నుంచి బయటపడిన విషయాన్ని ఆమె తలుచుకుంటూ... "గది అంతా పొగతో నిండిపోయింది. నాకు ఏమీ కనిపించలేదు" అని అన్నారు. అదృష్టవశాత్తు హోటల్ గది తలుపులకు తాళం వేయకపోవడంతో బయటపడ్డానని మమతా అన్నారు.

మల్దా పట్టణంలో మమతా బెనర్జీ బస చేసిన ఓ ప్రైవేట్ హోటల్ లోని ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో గది నిండా పొగ దట్టంగా అలముకొంది. ప్రమాద సమయంలో ఎక్కువ మొత్తంలో గ్యాస్ పీల్చుకున్నానని, దాదాపు చనిపోయాననే ఫీలింగ్ కలిగిందని మమతా తెలిపారు. రాత్రంతా శ్వాస సంబంధమైన సమస్యతో బాధపడ్డానని ఆమె అన్నారు.

More Telugu News