: నా భార్య తెచ్చిన డబ్బుకు లెక్కలు ఉన్నాయి: పార్థసారథి
తన భార్య వద్ద హైదరాబాదు పోలీసులు స్వాధీనం చేసుకున్న 45 లక్షల రూపాయలకు లెక్కలున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ అభ్యర్థి 70 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకోవచ్చని అన్నారు. కార్పొరేట్ బ్యాంకులో జమ చేసేందుకు కొంత, కన్ స్ట్రక్షన్ కంపెనీ కోసం చేసిన బకాయిలు తీర్చేందుకు మరికొంత మొత్తం తీసుకొచ్చినట్టు ఆయన చెబుతున్నారు.