: పోలీస్ బాస్ ఓటు గల్లంతు

బీహార్ డీజీపీ అభయానంద్ ఓటు గల్లంతయింది. దాంతో ఆయన గురువారం నాడు ఓటు వేయకుండానే పోలింగ్ బూత్ నుంచి వెనుదిరిగారు. పాట్నా సాహిబ్ లోక్ సభ నియోజకవర్గం శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్ లో ఉన్న సొంత ఇంట్లో డీజీపీ నివాసం ఉంటున్నారు. ఓటు వేసేందుకు ఉదయమే ఆయన పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఓటర్ల జాబితాలో పేరు కనిపించకపోవడంతో ఓటు వేయలేకపోయారు.

బీహార్ పోలీస్ బాస్ కు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయనకు ఇదే అనుభవం ఎదురైంది. కాగా, కీలకమైన పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ తరపున భోజ్ పురి నటుడు కునాల్ సింగ్, జేడీయూ అభ్యర్థిగా గోపాల్ ప్రసాద్ సిన్హా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పర్వీన్ అమానుల్లా బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News