: ములాయంతో విభేదించిన కోడలుపిల్ల
అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష విధించడం సరికాదన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయాలతో ఆయన చిన్న కోడలు విభేదించారు. అత్యాచారం చేసిన వారిని ఉరితీయాలని ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ అన్నారు. అదే సమయంలో మామ మనసు నొచ్చుకోకుండా ఆమె జాగ్రత్త వహించారు. ప్రపంచ వ్యాప్తంగా మరణశిక్షపై చర్చ జరుగుతోందంటూ నేతాజీ(ములాయం) చెప్పినది నిజమేనన్నారు. తన అభిప్రాయం ప్రకారం అత్యాచార దోషులను ఉరితీయాలన్నారు.