: తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

తిరుమల కొండ మీద ఈ రోజు పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి ఆలయానికి దగ్గర్లో ఉన్న ఓ టీ దుకాణంలో గ్యాస్ లీక్ అయింది. దీంతో దుకాణం చుట్టుపక్కల పొగలు వ్యాపించాయి. గందరగోళానికి గురైన భక్తులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి... లీకైన సిలిండర్ ను అక్కడ నుంచి తొలగించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

More Telugu News