: బాలయ్య ప్రభావం అంతంత మాత్రమే: వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఎన్ని కుట్రలు పన్నినా జగన్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ హిందూపూరం లోక్ సభ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలో ఇవాళ శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణం తర్వాత రాష్ట్రాభివృద్ధి మరింత కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. హిందూపురం నుంచి బరిలోకి దిగిన హీరో బాలకృష్ణ ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన అన్నారు.

More Telugu News