: విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటా: విజయమ్మ

విశాఖపట్నం లోక్ సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీ అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, షర్మిల పాల్గొన్నారు. అంతకు ముందు విజయమ్మ మాట్లాడుతూ పార్లమెంటు స్థానానికి గెలిచిన తర్వాత విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

విశాఖను గ్రీన్ సిటీ, కాలుష్య రహిత నగరంగా చేస్తామని జగన్ ఇచ్చిన హామీని నెరవేరుస్తానని విజయమ్మ అన్నారు. పేదల సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని ఆమె చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్ అయిదు సంతకాలు చేస్తారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని ఆమె తెలిపారు.

More Telugu News