: జగన్ కు రక్షణ పోరాటం ... చంద్రబాబుకు ఆఖరి పోరాటం!: చిరంజీవి

వైఎస్సార్సీపీ అధినేతకు ఈ ఎన్నికలు రక్షణ పోరాటం అని కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుకి ఆఖరిపోరాటమని అన్నారు. ఈసారి ఓడిపోతే మరెప్పుడూ ముఖ్యమంత్రిని కాలేనని చంద్రబాబు పోరాడుతున్నారని అన్నారు. అలాగే జగన్ తన అక్రమ సంపాదనను రక్షించుకునేందుకు, తనపైనున్న కేసుల నుంచి రక్షణ పొందాలని, తన అవినీతి నుంచి రక్షణ పొందడానికి రక్షణ పోరాటం చేస్తున్నారని అన్నారు.

వైఎస్సార్ మరణించి 24 గంటలు గడవక ముందే ఆయన అంతిమ సంస్కారం జరగకుండానే తక్షణం ముఖ్యమంత్రిగా జగన్ ను చేద్దామంటూ 20 మంది ఎమ్మెల్యేలు తన మద్దుతు కోరారని కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. తాను పీఆర్పీ నేతగా, ప్రతపక్ష నేతగా షాక్ కు గురై ఉన్నానని, వారి వాదనతో మరింత దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన తెలిపారు. తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలతో పదవుల పంపకానికి ఇది సరైన సమయం కాదని హితవు పలికానని ఆయన అన్నారు. అయినా ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు అధిష్ఠానం ఉందని, అది నిర్ణయిస్తుందని చెప్పానని ఆయన తెలిపారు.

More Telugu News