: రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసుదే గెలుపు: దిగ్విజయ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. హైదరాబాదులో దిగ్విజయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... నరేంద్రమోడీ ప్రభంజనం అంతా మీడియా సృష్టేనని, మోడీ హవా అంతగా లేదని అన్నారు.
పొత్తులో భాగంగా సీపీఐతో ఒక సీటు విషయంలో సమస్య వచ్చిందని, మిగతా చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్లకి మద్దతు ఇస్తారని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే సీపీఐ కూడా కాంగ్రెసుకు మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.