: పవన్ కల్యాణ్ జనసేన తరపున ఏడుగురు పోటీ?

సినీ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున ఏడుగురు అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. పొట్లూరి వరప్రసాద్ కు టీడీపీ, బీజేపీ కూటమి తరపున టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఎన్నికల్లోనే ప్రజల ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు వారు నామినేషన్లు వేయనున్నట్టు సమాచారం.

ఇప్పటికే టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇస్తున్న పవన్ కల్యాణ్, మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి జయప్రకాశ్ నారాయణకు కూడా మద్దతివ్వనున్నారు. మరో వైపు ఇతర నియోజకవర్గాల్లో తన అనుచరులను గెలిపించుకునేందుకు నడుం బిగించారు. దీనిపై పవన్ కల్యాణ్ నేడు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.

More Telugu News