: హాస్యనటుడు వడివేలుకు హైకోర్టులో చుక్కెదురు

ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలుకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ చిత్రంలో కృష్ణదేవరాయలను, తెలుగు భాషను కించపర్చేలా ఉన్న సన్నివేశాలు తొలగించి విడుదల చేసుకోవాలని హైకోర్టు సూచించింది.

వడివేలు హీరోగా నిర్మించిన తెనాలిరామన్ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని తెలుగు సంఘాలు కొద్ది రోజులుగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అభ్యంతకర సన్నివేశాలను తొలగించేందుకు నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు ఆదేశంపై తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

More Telugu News