: ఎన్నికలు ప్రజల కోసం జరగడం లేదు: రాహుల్ గాంధీ
ఈసారి సార్వత్రిక ఎన్నికలు ప్రజల కోసం జరగడం లేదని, కేవలం మోడీ కోసం జరుగుతున్నాయని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. జార్ఖాండ్ లో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరిగినా, జమ్మూ కాశ్మీర్ లో ఏమి జరిగినా, మహారాష్ట్రలో ఏమి జరిగినా, కోల్ కతాలో ఏమి జరిగినా ఓకే ఒక వ్యక్తికి తెలిసిపోతుందని, అతను నరేంద్ర మోడీ అని ఎద్దేవా చేశారు. అన్నీ తనకు తెలిసినట్టు మోడీ మాట్లాడుతున్నారని, ఏ వ్యక్తికీ అన్ని అంశాలమీద అవగాహన ఉండదని, అలా ఉండడం అసాధ్యమని రాహుల్ గాంధీ తెలిపారు.